Revanth Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నిక రేసులో తెరపైకి తెలుగు బ్రాండ్.. ఇండియా కూటమి అభ్యర్థి ఎంపిక వెనుక రేవంత్ చక్రం తిప్పారా?

ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా కలిసి నడిచిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి... ఇప్పుడు సీఎంలుగా.. ఒకే స్టైల్లో రాజకీయాన్ని నడుపుతున్నారు.

CM Revanth Reddy

Revanth Reddy: వైస్‌ ప్రెసిడెంట్ ఎన్నికల వేళ..అటు నేషనల్..ఇటు తెలుగు స్టేట్స్‌ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అందులో తెలంగాణ సెంట్రిక్‌గా చర్చ జరుగుతోంది. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరు ప్రకటించడంతో..సీఎం రేవంత్‌పై మరోసారి హైప్ క్రియేట్ అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి.. సుదర్శన్‌రెడ్డిని అభ్యర్థిగా పెట్టడానికి ఒప్పించడంలో ఆయనే కీరోల్ ప్లే చేశారని న్యూస్‌ హెడ్‌లైన్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. రేవంత్‌ కూడా ఇదే ఇండికేషన్ ఇస్తున్నారట.

మీడియా ప్రెస్‌మీట్లలో మాత్రం దీన్ని కొట్టిపడేసిన ఆయన..ఆఫ్‌ ది రికార్డు చిట్‌చాట్‌లో అంతా తన వల్లే. తాను సూచించిన వ్యక్తినే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక రాహుల్‌తో గ్యాప్‌ లేదు..గాలి పట్టేంత దూరం కూడా లేదని చెప్పేస్తున్నారట. సీఎం సన్నిహితులు కూడా అధిష్టానం దగ్గర అన్న వెయిటేజ్ పెరిగిందని..రేవంత్‌ ఎంత చెప్తే అంత అన్నట్లుగా సీన్ మారిపోయిందని చెప్పుకుంటున్నారట. ఇండియా కూటమి అంటే..కాంగ్రెస్‌తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సమూహం.

Also Read: YS Jagan: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ మద్దతు.. ప్లానేంటి..?

అలాంటి ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి పేరును రేవంత్ ప్రతిపాదించడం..అధిష్టానం ఓకే చెప్పడం..ప్రకటించేసేయడం అంత చకచకా జరిగిపోయాయట. అయితే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా సుదర్శన్‌రెడ్డి చాలా దగ్గర అని అంటున్నారు. సేమ్‌టైమ్‌ ఉత్తమ్‌ హైకమాండ్‌కు దగ్గర. ఓ రకంగా గాంధీ ఫ్యామిలీ ఆయనను కుటుంబ సభ్యునిగా భావిస్తుంది. సో ఉత్తమ్‌ కూడా సుదర్శన్‌రెడ్డి ఎంపికలో కీరోల్‌ ప్లే చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా తను చక్రం తిప్పడం వల్లే సుదర్శన్‌రెడ్డి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యారని అటెన్షన్ గ్రాబ్‌ చేయడంలో రేవంత్ ముందున్నారని కాంగ్రెస్‌లోనే చర్చ జరుగుతోందట.

ఇంకో ఇంట్రెస్టింగ్‌ టాక్‌

అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఇంకో ఇంట్రెస్టింగ్‌ టాక్‌ నడుస్తోంది. చంద్రబాబుకు..రేవంత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసినవే. టీడీపీలోనే ఎదిగి..ఆ తర్వాత కాంగ్రెస్‌ గూటికి చేరి పీసీసీ చీఫ్‌ అయి..ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు. అప్పట్లో అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా తెరమీదకు తెచ్చి చంద్రబాబు ఎంత పేరు తెచ్చుకున్నారో..ఇప్పుడు తాను అదేస్థాయి నేషనల్ ఎక్స్‌పోజర్‌ పొందాలనే ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ఖరారుకు స్కెచ్ వేశారట రేవంత్.

నాడు ఎన్డీయే కన్వీనర్‌గా..దక్షిణాదికి చెందిన అబ్దుల్ కలాం ఎంపికలో కీలక పాత్ర పోషించడంతో చంద్రబాబు నేమ్‌, ఫేమ్‌ జాతీయ స్థాయిలో మార్మోగింది. సరిగ్గా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ..తెలుగు సెంటిమెంట్‌తో తన హైప్‌ను పెంచుకునే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారన్న డిస్కషన్ జరుగుతోంది. నాడు ఎన్డీయే కూటమి అభ్యర్ధి ఎంపికలో చంద్రబాబు వ్యవహరించనట్లే..ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి ఖరారులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారట.

ఇండియా కూటమిని డిఫెన్స్‌లోకి నెట్టిన బీజేపీ?

మొదట తమిళనాడు నుంచి..డీఎంకే ఎంపీని బరిలో దించాలని ఇండియా కూటమి భావించిందట. దీనికి కౌంటర్‌గా అదే రాష్ట్రానికి చెందిన..రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించి..ఇండియా కూటమిని డిఫెన్స్‌లో నెట్టింది బీజేపీ.

దీంతో అయోమయంలో ఉన్న ఇండియా కూటమిలో..తనదైన రాజకీయ చతురత ప్రదర్శించిన రేవంత్ రెడ్డి..జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారట. (Revanth Reddy)

అంతే కాదు ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ మద్దతు కోరేందుకు స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను కలిసి కాస్త హడావుడి చేయాలనే ఆలోచన కూడా చేశారట రేవంత్‌. కానీ అంతకంటే ముందే రేవంత్‌ మద్దతున్న వ్యక్తికి తాము మద్దతిచ్చే ప్రసక్తేలేదని బీఆర్‌ఎస్‌ తేల్చేసింది. అంతేకాదు తెలంగాణ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి బీసీ అభ్యర్థే దొరకలేదా అంటూ రేవంత్‌పై ఎటాక్‌ కూడా మొదలు పెట్టారు గులాబీ నేతలు. దీంతో కేసీఆర్‌ విషయంలో రేవంత్‌ వ్యూహం వర్కౌట్ అయ్యే అవకాశాలు లేకుండా పోయాయని అంటున్నారు.

ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా కలిసి నడిచిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి… ఇప్పుడు సీఎంలుగా.. ఒకే స్టైల్లో రాజకీయాన్ని నడుపుతున్నారు. దేశ రాజకీయాల్లో… నాడు రాష్ట్రపతి ఎన్నికలతో చంద్రబాబుకు నేషనల్ గ్లామర్ తెచ్చిపెడితే.. ఇదే ఫార్ములాను ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్‌ అమలు చేస్తున్నారట. మరి తెలంగాణ సెంట్రిక్‌గా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాలిట్రిక్స్ నడుపుతున్న రేవంత్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.