Telangana Elections 2023: మేనిఫెస్టో విడుదలకి, ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవానికి టీపీసీసీ తేదీలు ఖరారు

త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Telangana Elections 2023 – Revanth Reddy: తెలంగాణలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తమ పార్టీకి సంబంధించి కీలక విషయాలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ (Congress) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయని, అక్టోబర్ 2 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పోరాడే వారికే భవిష్యత్ ఉంటుందని చెప్పారు.

విద్యార్థులు, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని అన్నారు. బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే అదానీ, ప్రధాని అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని చెప్పారు.

రాష్ట్రంలో కేసీఆర్ పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించాలని ఆయన అన్నారు. డిసెంబర్ 9 న సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని అన్నారు.

Minister Gangula Kamalakar : మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం

ట్రెండింగ్ వార్తలు