Revanth Reddys Team : రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఇదే?

కేబినెట్ ఎలా ఉండబోతోంది? కేబినెట్ లోకి ఎవరెవరిని తీసుకుంటారు? వారికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ సీఎం ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ నుంచి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరుని అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు రేవంత్. ఇక ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ పై పడింది. కేబినెట్ ఎలా ఉండబోతోంది?మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారు? వారికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఎల్లుండి దాదాపు 15మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అయితే.. సామాజికవర్గాల వారీగా, జిల్లాల వారీగా చూస్తే.. కొంతమంది నేతలు దాదాపుగా రేవంత్ కేబినెట్ లోకి రాబోతున్నారని తెలుస్తోంది. వాళ్ల సామాజికవర్గం ఏంటి? వారిది ఏ జిల్లా? వారికి ఏ ఈక్వేషన్ కలిసి వస్తుంది? అన్నదే ఆసక్తికరంగా మారింది.

రేవంత్‌ క్యాబినెట్‌లో ఎవరికి ఛాన్స్‌?
భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎంగా ప్రకటించే అవకాశం
సీతక్క (ములుగు)
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(పాలేరు)
తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం)
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(నల్గొండ)
ఉత్తమ్ కుమార్ రెడ్డి(హుజూర్ నగర్)
జూపల్లి కృష్ణారావు(కొల్లాపూర్)
సుదర్శన్ రెడ్డి(బోధన్)
దుద్దిళ్ల శ్రీధర్ బాబు(మంథని)
గడ్డం వివేక్(చెన్నూరు)
దామోదర రాజనర్సింహ(ఆందోల్)
పొన్నం ప్రభాకర్(హుస్నాబాద్)
కొండా సురేఖ(వరంగల్ ఈస్ట్)

 

ట్రెండింగ్ వార్తలు