RGV Tweet: ఈ ఎమ్మెల్యే సింహమా.. సింహాలకే సింహమా
వివాదాల వర్మ ఈ సారి కాంప్లిమెంట్ ఇచ్చారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌ను కలిసిన ఫొటోను పోస్ట్ చేసిన వర్మ.. రీసెంట్ గా మరో వీడియో పోస్టు చేశారు. 'టైగర్/ప్యాంథర్/ నాగర్జున సాగర్ లయన్ ఎమ్మెల్యే నోముల భగత్‌ను కలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది.

Rgv Tweet
RGV Tweet: వివాదాల వర్మ ఈ సారి కాంప్లిమెంట్ ఇచ్చారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌ను కలిసిన ఫొటోను పోస్ట్ చేసిన వర్మ.. రీసెంట్ గా మరో వీడియో పోస్టు చేశారు. ‘టైగర్/ప్యాంథర్/ నాగర్జున సాగర్ లయన్ ఎమ్మెల్యే నోముల భగత్‌ను కలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. సూపర్ లయన్ కింగ్ గూడి వంశీరెడ్డి అతణ్ని పరిచయం చేశారు’ అని ముందుగా పోస్టు పెట్టారు.
ఆ తర్వాత వీడియోలో నోముల భగత్ సింహాలతో పాటు నడుస్తున్న వీడియోను పోస్టు చేశారు. ఈ నాగర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ సింహమా.. లేక సింహాలకి సింహమా? ఈ నా ప్రశ్న నల్గొండ జిల్లా ప్రజలకి.. సమాధానం చెప్పండి ప్లీజ్’ అంటూ ఆసక్తికరంగా కామెంట్ చేశారు.
Ee Nagarjunasagar MLA @bagathnomula
Simhamaa , leka simhaalaki simhamaa? Ee naa prashana Nalgonda zilla Prajalaki…….Samaadhaanam cheppandi please ? pic.twitter.com/T0x8HwyV8M— Ram Gopal Varma (@RGVzoomin) August 6, 2021
గురువారం జెనీలియా – రితేశ్ ల వీడియో ట్వీట్ చేస్తూ ప్రపంచంలో సంతోషంగా ఉన్న భార్యాభర్తలంటే వీల్లేనేమో అని పోస్టు పెట్టాడు. బర్త్ డే సందర్భంగా జెనీలియాకు శుభాకాంక్షలు తెలిపారు. ద్వందార్థాలతో ట్వీట్ చేసే వర్మ పోస్టు ప్రతీది వైరల్ గానే ఉంది.