Site icon 10TV Telugu

Bhadrachalam Godavari : గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం

Godavari flood

Godavari flood

Bhadrachalam Godavari : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శనివారం ఉదయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 46.60 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. నీటిమట్టం 48 అడుగులుకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేసే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే.. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భద్రాచలం వాసులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నదివైపునకు ఎవరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Also Read: Heavy Rain Alert : వామ్మో.. బంగాళాఖాతంలో మరో మూడు అల్పపీడనాలు.. అతిభారీ వర్షాలు కురవబోతున్నాయ్..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్సాల కారణంగా గోదావరిలోకి వరదనీరు పోటెత్తింది. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 18.10 మీటర్లు, పోలవరం వద్ద 11.71 మీటర్లు మేర ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ అండ్ ఔట్ ఫ్లో 7.99లక్షల క్యూసెక్కులుగా ఉంది. గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పాలేరు, వైరా రిజర్వాయర్లతోపాటు తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు భారీగా వరద నీరువచ్చి చేరుతోంది. మున్నేరుకుసైతం వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Exit mobile version