Road Accident : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్సీయూ వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది.
- kunduru Vinod
- Published On : December 18, 2021 / 07:53 AM IST
Road Accident (2)
Road Accident : హైదరాబాద్ నగరంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్సీయూ వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదంలో కారు రెండు ముక్కలైంది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో కారు 200 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
చదవండి : Road Accident : ట్రాక్టర్ బోల్తా పడి విద్యార్ధిని మృతి
మృతులను కారు డ్రైవ్ చేస్తున్న అబ్దుల్లాగా (బ్యాంకు ఉద్యోగి), జూనియర్ ఆర్టిస్టులు ఎన్. మానస, ఎం. మానసగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సిద్ధు అని, అతడు కూడా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడని చెప్పారు. ఇక వీరంతా అమీర్‌పెట్ లో ఉంటున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి : Road Accident : ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి
చదవండి : Road Accident : సిద్ధిపేట జిల్లాలో ఘోరప్రమాదం..
