Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని ఇద్దరు మహిళల మృతి.. ఆ తర్వాత మరో ప్రమాదం

మృతులను లింగమ్మ (42), తిరుపతమ్మ (43)గా పోలీసులు గుర్తించారు.

Road Accident

Road Accident – ORR: తెలంగాణలోని కీసర (Keesara) పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాద్గార్‌పల్లి (Yadgarpally) సమీపంలో ఓ డీసీఎం ( నంబరు TS 05 UF 3876) కూలీలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మహిళలు పారిశుద్ధ్య పనులు చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మృతులను లింగమ్మ (42), తిరుపతమ్మ (43)గా పోలీసులు గుర్తించారు. మృతులు బీరంగూడ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెప్పారు. మరోవైపు, ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన పది నిమిషాలకే అక్కడే మరో ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని చూస్తూ ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆటో(TS 08 UG 7645)ను నడిపాడు.

దీంతో ఆ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. అదే సమయంలో మృతులు లింగమ్మ, తిరుపతమ్మ బంధువులు ఔటర్ రింగ్ రోడ్డు పనుల కాంట్రాక్టర్ రావాలంటూ అంబులెన్స్ ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మృతుల బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది.

Hyderabad : భాగ్యనగరంలో పాములు.. వర్షంలో చూసుకుని వెళ్లండి..