Road Accident : శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
Road Accident : రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Updated on- September 19, 2026 / 07:07 AM IST
Road Accident
Road Accident : రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించగా.. కారు డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో మృతులు కేతావత్ లింబ్య, కేతావత్ జమున, మాన్‌సింగ్, వాస్రామ్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామంకు చెందిన వారుకాగా.. ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది.
కారు అతివేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
