Road Accident : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఈ దుర్ఘటనలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ లోని యూసఫ్ గుడకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు.

Road Accident (2)

Road Accident : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కొడంగల్ పట్టణానికి సమీపంలో హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై బండల ఎల్లమ్మ దేవాలయానికి కొద్దీ దూరంలో రెండు కార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి.

ఈ దుర్ఘటనలో ఇన్నోవా వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు హైదరాబాద్ లోని యూసఫ్ గుడకు చెందిన అబ్దుల్, రషీద్, అమీర్, మలాన్ బేగంలుగా గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.