హైదరాబాద్ ఖజానా జ్యూయలర్స్ లో కాల్పులు.. దోపిడీకి ప్రయత్నం..

హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. చందానగర్ లోని జ్యూవెలరీ షాపులో ..

Gunfire

Hyderabad: కాల్పుల కలకలం హైదరాబాద్ నగర వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మంగళవారం ఉదయం చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ షాపులోకి కొంతమంది దుండగులు దొంగతనానికి యత్నించారు. వారు తుపాకులతో ఒక్కసారిగా దుకాణంలోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు. అక్కడున్న సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై రెండు రౌండ్లు కాల్పులకు తెగబడ్డారు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలపై ఫైర్ చేశారు.

ఖాజనా జ్యువలరీ షాపులోకి ప్రవేశించిన దుండగులు లాకర్ తాళాలు ఇవ్వాలని సిబ్బందిని గన్‌తో బెదిరించారు. లాకర్ తాళం ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు జరిపారు. లోపలకు వెళ్లి బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టారు. అడ్డొచ్చిన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. దీంతో భయంతో షాపులోని సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపే దొంగల ముఠా అక్కడి నుంచి పారిపోయింది. దొంగల ముఠాలో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.

దుండగులు అసిస్టెంట్ మేనేజర్ కాళ్ళపై కాల్పులు జరిపారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దుంగుల ముఠాలో ఆరుగురు ఉన్నారు. వారంతా తుపాకులతో దుకాణంలోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కాల్పులకు తెగబడ్డారు.

ఘటన అనంతరం దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయారు. వారికోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కూకట్‌పల్లిలో వృద్ధ దంపతుల ఇంట్లో చోరీ పాల్పడిన నిందితులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో పోలీసులను సైబరాబాద్ సీపీ అలర్ట్ చేశారు. అయితే, దుకాణంలో భారీగా గోల్డ్ చోరీ అయినట్లు తెలుస్తోంది.