Jagtial : జగిత్యాలలో రౌడీషీటర్ దారుణ హత్య

జగిత్యాలలో దారుణం జరిగింది. హనుమాన్ వాడకు చెందిన రౌడీషీటర్ తోట శేఖర్ (35) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.

Atp Murder

Jagtial : జగిత్యాలలో దారుణం జరిగింది. హనుమాన్ వాడకు చెందిన రౌడీషీటర్ తోట శేఖర్ (35) ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగించిన కొందరు వ్యక్తులు ఆ తర్వాత అతడినీపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కాగా గతంలో కూడా శేఖర్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు శేఖర్.. శుక్రవారం రాత్రి ప్రత్యర్థులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి వచ్చి శేఖర్ మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ ను హత్యచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

చదవండి :  భార్యను పాముతో చంపించిన భర్తకు రెండు శిక్షలు విధించిన కోర్టు