Kerala Uthra Murder Case : భార్యను పాముతో చంపించిన భర్తకు రెండు శిక్షలు విధించిన కోర్టు

భార్య పేరున ఉన్న ఆస్తి కాజేయటానికి ఆమెను పాముతో చంపి హత్య చేసిన భర్తకు కొల్లాం కోర్టు బుధవారం రెండు శిక్షలు విధించింది.

Kerala Uthra Murder Case : భార్యను పాముతో చంపించిన భర్తకు రెండు శిక్షలు విధించిన కోర్టు

Utra Murder Case

Kerala Uthra Murder Case : భార్య పేరున ఉన్న ఆస్తి కాజేయటానికి ఆమెను పాముతో చంపి హత్య చేసిన భర్తకు కొల్లాం కోర్టు బుధవారం రెండు శిక్షలు విధించింది. భార్య ఉత్ర మరణానికి కారణమైన భర్త సూరజ్ కు కొల్లాంలోని ట్రయల్ కోర్టు రెండు సార్లు జీవితఖైదు శిక్షలను విధించింది. ఇది అత్యంత అరుదైన కేసు అని కొల్లాం అడిష‌న‌ల్ సెష‌న్స్ జ‌డ్జి ఎం మ‌నోజ్ తీర్పు చెపుతూ వ్యాఖ్యానించారు. నిందితుడు సూరజ్ కు మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరినా కోర్టు మాత్రం డబుల్ జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది.

సూర‌జ్‌పై న‌మోదు అయిన కేసుల్లో .. ఒక కేసులో ప‌దేళ్లు, మ‌రో కేసులో ఏడేళ్ల శిక్ష ప‌డింది. మొత్తంగా సూర‌జ్ 17 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభ‌వించాల్సి ఉంటుంది. జీవిత‌ ఖైదు శిక్ష‌తో పాటు అత‌నికి రూ. 5 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించారున్యాయమూర్తి.

2020 మార్చిలో ఉత్ర‌పైకి ఒకసారి పామును వదిలాడు సూర‌జ్‌. దాని కాటుతో ఉత్ర తీవ్ర అనారోగ్యం పాలైంది. 52 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకుంది. ఆ వెంటనే రూ.10 వేలు ఖర్చుపెట్టి మరోసారి పాములు పట్టే సురేష్ అనే వ్యక్తిని సూరజ్‌ పిలిపించాడు. అతని సాయంతో మే నెలలో తాచుపామును భార్యపైకి పంపించాడు. అది కూడా ఆమెను కాటేసింది. అయితే ఈసారి ఆమె కన్నుమూసింది.

Also Read :   Uthra Murder Case : పాము కాటుతో భార్య మృతి.. భర్తను దోషిగా తేల్చిన కోర్టు

అనంతరం సూరజ్ ఉత్ర ఆస్తి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో కుమార్తె మరణంపై అనుమానం వచ్చిన ఉత్ర తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బయటపడింది. సూరజ్ కు పాములు సప్లై చేసిన సురేష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన తర్వాత సురేష్ అప్రూవర్‌గా మారి జరిగిందంతా పోలీసులకు చెప్పటంతో సురేష్ లోని రాక్షసుడు బయటపడ్డాడు.

కోర్టు నిర్ణయాన్ని ఆ రాష్ట్ర డీజీపీ అనీల్ కాంత్ ప్రశంసించారు. సందర్భానుసార సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని దోషిగా నిర్ధారించిన అరుదైన కేసులలో ఇది ఒకటని ఆ అనీల్ కాంత్ అన్నారు. ఒక హత్య కేసును శాస్త్రీయంగా, వృత్తిపరంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా ఎలా పరిశోధించాలో అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని డీజీపీ తెలిపారు.