Hyderabad Huge Money Seized
Hyderabad Huge Money Seized : ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో పోలీసులకు భారీగా నగదు, బంగారం, వెండి పట్టుబడుతోంది. సోమవారం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీ నగర్ పోలీసులు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.9 కోట్లను గుర్తించారు. కారు, బైక్ ను సీజ్ చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం, వెండిని పోలీసులు సీజ్ చేశారు. మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 17 కిలోల బంగారం, 17 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించిన బిల్లులు చూపకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా వనస్థలీపురంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.29.40 లక్షలను సీజ్ చేశారు. నగరంలోని కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా రూ.26 లక్షల 25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తుండగా కేపీహెచ్ బీ పోలీసులు పట్టుకున్నారు. సరైన ఆధారాలు చూపించక పోవడంతో పోలీసులు నగదు సీజ్ చేశారు.
Kurnool : కర్నూలులో కలకలం.. కారులో నోట్ల కట్టలు, రూ.2.50 కోట్లు సీజ్
అలాగే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా రూ.9లక్షల 81వేల 250లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా 32లక్షల రూపాయలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా 10 లక్షల 39 వేల రూపాయల నగదను గచ్చిబౌలి పోలీసులు సీచ్ చేశారు.మరోవైపు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబిల్ పూర్ చెక్ పోస్టు వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న డబ్బులను పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నుండి నగరం వైపు వస్తుండగా శివ ప్రణయ్ కుమార్ అనే వ్యక్తి వద్ద నుండి 4 లక్షల 12 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.