Kurnool : కర్నూలులో కలకలం.. కారులో నోట్ల కట్టలు, రూ.2.50 కోట్లు సీజ్

Kurnool : నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవటంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి నుంచి నగదును బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు.

Kurnool : కర్నూలులో కలకలం.. కారులో నోట్ల కట్టలు, రూ.2.50 కోట్లు సీజ్

Kurnool

Kurnool : కర్నూలు జిల్లాలో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. పంచలింగాల ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద కారులో తరలిస్తున్న 2.50 కోట్ల రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరుకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారి నుంచి నగదును బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవటంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. కర్నాటకలో ఎన్నికల కోసం డబ్బును తరలిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read..TTD Fake Website : మరో నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన టీటీడీ

కారులో భారీగా నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు రంగంలోకి దిగారు. చెక్ పోస్టు దగ్గర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన ఓ కారులో భారీగా నగదు గుర్తించారు. పెద్ద మొత్తంలో డబ్బు ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ డబ్బుకి సంబంధించి కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఆరా తీశారు. అయితే, వారి నుంచి సరైన వివరాలు రాలేదు. దానికి తోడు నగదుకి సంబంధించి ఎలాంటి రశీదులు లేవు. దాంతో పోలీసులు డబ్బుని సీజ్ చేశారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

కారులో పెద్ద మొత్తంలో నగదు ఉండటం కలకలం రేపింది. పైగా డబ్బుకి సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు కర్నాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో ఇంత పెద్ద మొత్తాన్ని బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీన్ని రాజకీయ కోణంలోనూ చూస్తున్నారు. ఎన్నికల కోసమే ఈ డబ్బుని అక్కడికి తరలిస్తున్నారా? అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరికి ఇవ్వబోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.