TTD Fake Website : మరో నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన టీటీడీ

ఏదైతే టీటీడీ వెబ్ సైట్ ఉంటుందో అదే తరహాలో స్వల్ప మార్పులతో భక్తులను నమ్మించే విధంగా నకిలీ వెబ్ సైట్లను సృష్టించి భక్తుల నుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు.

TTD Fake Website : మరో నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన టీటీడీ

TTD

TTD Fake Website : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి నకిలీ వెబ్ సైట్ల బెడద పట్టుకుంది. తిరుమలలో మరో నకిలీ వెబ్ సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన టీటీడీ ఐటీ విభాగం తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ దీనిపై విచారణ చేస్తోంది. నకిలీ వెబ్ సైట్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ సూచించింది. ఇప్పటికే 40 నకిలీ వెబ్ సైట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజాగా కేసులో వెబ్ సైట్ల సంఖ్య 41కి చేరింది. టీటీడీ వెబ్ సైట్ ను పోలిన రీతిలోనే నకిలీ వెబ్ సైట్లను కోకొళ్లలుగా సృష్టించి మోసగాళ్లు భక్తులను సులభంగా మోసం చేస్తున్న వైనాన్ని టీటీడీ గుర్తించింది. ఇటీవలనే 40 నకిలీ వెబ్ సైట్లను గుర్తించి పోలీసులకు పిర్యాదు చేసింది. తాజాగా ఆదివారం మరో నకిలీ వెబ్ సైట్ ను టీటీడీ గుర్తించింది.

MLC Sheikh Shabji : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల స్కామ్.. నన్ను ఇరికించే కుట్ర, కోర్టులో తేల్చుకుంటా-ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ

టీటీడీ ఐటీ  విభాగం నకిలీ వెబ్ సైట్ ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొంతకాలంగా భక్తులు పెద్ద ఎత్తున మోసపోతుండటంతో టీటీడీ నకిలీ వెబ్ సైట్లపై దృష్టి సారించింది. ఏదైతే టీటీడీ వెబ్ సైట్ ఉంటుందో అదే తరహాలో స్వల్ప మార్పులతో భక్తులను నమ్మించే విధంగా నకిలీ వెబ్ సైట్లను సృష్టించి భక్తుల నుంచి లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్నారు.