MLC Sheikh Shabji : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల స్కామ్.. నన్ను ఇరికించే కుట్ర, కోర్టులో తేల్చుకుంటా-ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ

MLC Sheikh Shabji : ఎవరి మీదో కక్షతో, కోపంతో నన్ను కేసులో ఇరికించడం జరిగింది. నాకు ఫ్యాబ్రికేషన్ చేయాల్సిన అవసరం లేదు. 32 సంవత్సరాలుగా సమాజం కోసం అనేక త్యాగాలు, పోరాటాలు చేశా. నాకు వ్యక్తిగత ఆస్తులు లేవు.

MLC Sheikh Shabji : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల స్కామ్.. నన్ను ఇరికించే కుట్ర, కోర్టులో తేల్చుకుంటా-ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ

MLC Sheikh Shabji

MLC Sheikh Shabji : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల స్కామ్ కలకలం రేపుతోంది. ఏలూరు టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ డబ్బులకు సిఫార్సు లేఖలు ఇస్తునట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఫోర్జరీ ఆధార్ కార్డులతో ఇతర రాష్ట్రాల భక్తులకు ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ వీఐపీ దర్శనం చేయిస్తున్నారని తెలిపింది. దీనిపై ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ స్పందించారు.

”టీటీడీ నాకు ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తుంది. ప్రతి నెల నేను శ్రీవారిని దర్శించుకుంటున్నా. నా తరపున తిరుమలకు వచ్చే వారి కోసం తిరుమలలో లెటర్ సబ్మిట్ చేయడానికి వేణుగోపాల్ అనే వ్యక్తిని నియమించుకున్నా. బెంగళూరుకు చెందిన ఎల్ రవీంద్ర అనే మిత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తిరుమలలో వేణుగోపాల్ అనే వ్యక్తి ఆధార్ కార్డులను ఫ్యాబ్రికేట్ చేసి లెటర్ పెట్టడం జరిగింది.

టీటీడీ 10మందికి దర్శనం ఇచ్చారు. రవీంద్ర ఫ్యామిలీకి, నాకు ఏమీ తెలియదు. ఆధార్ కార్డులను ఫ్యాబ్రికేట్ చేయడం నేరం. ఆధార్ కార్డు ఫ్యాబ్రికేట్ పై నేను ఫిర్యాదు చేస్తానని చెప్పా. నాకన్నా ముందు రవీంద్ర దగ్గర ఫిర్యాదు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. రవీంద్ర దగ్గర తీసుకున్న ఫిర్యాదులో వారికి కావలసినవి రాసుకుని అతని వద్ద సంతకం తీసుకున్నారు.

Also Read..TTD : భక్తుల నుంచి డబ్బులు వసూళ్లు .. టీటీడీ విజిలెన్స్‌కు చిక్కిన ఎమ్మెల్సీ షేక్ షాబ్జి

ఒక ఎమ్మెల్సీగా నాతో పాటు ఎవరినైనా దర్శనానికి తీసుకెళ్లే హక్కు నాకుంది. నా హక్కులను కాలరాయడం నేను ఖండిస్తున్నా. ఇది చాలా దుర్మార్గం. నాకు నోటీసులు ఇచ్చారు. కేసు దర్యాప్తుకు నేను పూర్తిగా సహకరిస్తా. నన్ను ఈ కేసులో ఇరికించడం పట్ల నేను హైకోర్టులో తేల్చుకుంటా. వాస్తవాలు దర్యాప్తులో తేలుతాయి.

ఎవరి మీదో కక్షతో, కోపంతో నన్ను కేసులో ఇరికించడం జరిగింది. నాకు ఫ్యాబ్రికేషన్ చేయాల్సిన అవసరం లేదు. పక్కా వ్యూహంతో నాపై ప్రయోగించారు. 32 సంవత్సరాలుగా నేను సమాజం కోసం అనేక త్యాగాలు, పోరాటాలు చేశాను. నాకు ఎటువంటి వ్యక్తిగత ఆస్తులు లేవు. ఎమ్మెల్సీగా నాకు ఇస్తున్న రూ.1,75,000 జీతాన్ని కూడా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నా. ఈ కేసులో టార్గెట్ నేనా? లేక వేణుగోపాలా? తెలీదు. టీటీడి విజిలెన్స్ చెప్పేదానికి వాస్తవానికి సంబంధం లేదు” అని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అన్నారు.