BSP Manifesto : బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్, గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు

బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో నిరుద్యోగుల గురించి ప్రస్తావన ఎక్కడ కనపడలేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పేదలకు బరోసా ఇచ్చేలా లేదని విమర్శించారు.

BSP election manifesto

BSP Election Manifesto : బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానను 2,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గుర్తించిన ప్రజల సమస్యలే తమ మేనిఫెస్టో లో చేర్చానని తెలిపారు. శ్రీకాంతాచారి ఉద్యోగ హామీ ద్వారా ప్రతి ఏడాది టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

పేపర్ లీకేజీ లేకుండా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. పూర్ణ-ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రతినెల 15,000 ఉపకార వేతనం, క్రీడా పరికరాలు, పోషకాహారాన్ని అందజేస్తామన్నారు. మెదక్ కు ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు పెడతామని తెలిపారు.

Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం : రేవంత్ రెడ్డి

గద్దర్ స్మారకంగా గద్దర్ ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రతి జిల్లాలో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ బిజినెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కొత్త వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలతోపాటు, రాయితీలు కల్పిస్తామని చెప్పారు.

కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన క్రీడా ప్రాంగణాలు నిరూపయోగంగా ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో నిరుద్యోగుల గురించి ప్రస్తావన ఎక్కడ కనపడలేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పేదలకు బరోసా ఇచ్చేలా లేదని విమర్శించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అంకెల గారడీ అని ఎద్దేవా చేశారు.