Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం : రేవంత్ రెడ్డి
ఇది తన గ్యారంటీ అని రజనీకి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును స్వయంగా రేవంత్ రజినీ పేరుతో నింపడం విశేషం.

TPCC President Revanth Reddy, Rajini
TPCC President Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని రజినీ తన ఆవేదనను రేవంత్ కు చెప్పి వాపోయారు. దీనిపై ఆయన స్పందించారు.
డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని.. తమ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తారని తెలిపారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ రజనీకి ఉద్యోగం ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రజనీకి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును స్వయంగా రజినీ పేరుతో రేవంత్ రెడ్డి నింపడం విశేషం.
Also Read: బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే : పొంగులేటి
కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరిక
కాంగ్రెస్ అధికారంలోకి రావాలని యావత్తు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ మొదటి లిస్టులోని అభ్యర్థులందరూ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి సీట్లు అడుగుతున్న వారికి సీట్లు రాకపోయినా వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అక్టోబర్18న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల కోసం ప్రచారానికి ములుగు జిల్లా నుండి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ములుగు నుంచి ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.