RTC Bus Fares Hiked: హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు చేశారు. బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఛార్జీల పెంపు చేశారు. మొదటి 3 స్టేజ్ లకు 5 రూపాయలు, 4వ స్టేజ్ నుంచి 10 రూపాయలు అదనపు ఛార్జీలని వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్ కి 5 రూపాయలు.. రెండో స్టేజ్ నుంచి 10 రూపాయలు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. పెరిగిన ఛార్జీలు ఈ నెల 6నుంచి అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులతో పాటు డీజిల్ తో నడిచే బస్సులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయబోతోంది ప్రభుత్వం. గడిచిన కొన్ని రోజులుగా ప్రయాణికుల తాడికి పెరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ కారణంగా ఆర్టీసీపై కొంత అదనపు భారం పడనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మూడు స్టాప్ ల వరకు 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇకపై 15 రూపాయలు చెల్లించాలి. 2027 నాటికి 2వేల 800 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం వల్ల ఔటర్ రింగ్ రోడ్ లోపల కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆ దిశగా ప్రణాళికలు చేస్తోంది.
TGSRTC అధికారుల ప్రకారం 2027 నాటికి ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో డీజిల్ బస్సుల సంఖ్య 2,800కు పెంచాలనే ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఛార్జీల సవరణ జరిగింది. ఈ చర్య నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం శుభ్రమైన, ఆకుపచ్చ ప్రజా రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం, గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆరు డిపోలలో 265 ఇ-బస్సులు నడుస్తున్నాయి. ఈ సంవత్సరం మరో 275 బస్సులు ఈ ఫ్లీట్‌లో చేరనున్నాయి. అదే సమయంలో, TGSRTC 19 డిపోలలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. రూ.392 కోట్ల అంచనా వ్యయంతో 10 కొత్త డిపోలు, ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది.