RTC MD Sajjanar : సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తార్నాక ఆసుపత్రి : సజ్జనార్

తార్నాకలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఉన్న ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చనున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Tarnaka Hospital into a Super Specialty Hospital : తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించుకున్నామని..ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీని కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.సోమవారం తార్నాక ఆర్టిసీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవల ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఈ ఆస్పత్రిని డయాలసిస్, 24 గంటలు ఫార్మా యూనిట్, ఇప్పుడు ఐసీయూ ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే మార్చిలోపు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిద్దుతామని స్పష్టం చేశారు.

Read more : Tarnaka RTC Hospital : కరోనా కాటుకు బలవుతున్న ఆర్టీసీ ఉద్యోగులు.. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చండి..

అందరి కృషితో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చాబరంరాకె, లేగాటో, డి.బీ.ఎస్ నుంచి దాతలు కూడా ముందుకువచ్చారని సజ్జనార్ తెలిపారు. అలాగే ఆర్టీసీ ఆదాయం పెరిగిందని..ఆదాయం కార్డ్ స్థాయికి పెరిగిందని సజ్జనార్ అన్నారు. ఉద్యోగుల కోసం యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.ఉద్యోగుల కోసం యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని అందరు సమిష్టిగా కృషి చేసి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడంలో పాలుపంచుకోవాలని ఈసందర్భంగా సజ్జనార్ పిలుపునిచ్చారు.

Read more : TSRTC : దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్

కాగా..తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగల కోసం తార్నాకలో  ప్రత్యేక ఆస్పత్రి ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చటానికిని సజ్జనార్ కృషి చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ గా తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న సెన్సెషనల్ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా నియమించబడిన విషయం తెలిసిందే. ఆయన ఆర్టీసీగా ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి పలు కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. పలు వినూత్న నిర్ణయాలతో సజ్జనార్ ఆర్టీసీలో తన దైనశైలిలో వినూత్న చర్యలు చేపట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో పడిందని తెలిపారు.

Read more : Sajjanar : రంగంలోకి సజ్జనార్.. నిందితుడు బస్టాండ్లలో ఉండొచ్చు.. ఆర్టీసీ సిబ్బంది బీఅలర్ట్..!

 

 

ట్రెండింగ్ వార్తలు