private travel buses
Private Travels : సంక్రాంతి పండగ సందర్భంగా అనధికారికంగా… అనుమతుల్లేకుండా ప్రయాణికులను చేరవేస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీవో అధికారులు తనిఖీలు చేశారు.
హైదరాబాద్ నగర శివార్లులోని పెద్ద అంబర్ పేట రింగ్ రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని మూడు ప్రవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు.
నిబంధనలకు విరుధ్ధంగా తిరుగుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. శంషాబాద్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు పాటించని ఆరు ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుధ్దంగా అనుమతులు లేకుండా బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.