Roopa Reddy Case : రూపారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

Roopa Reddy Case : అధిక వడ్డీలు, భారీ లాభాలు ఇస్తామని ఆశచూపి నగదు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై రూపా రెడ్డిపై రాయదుర్గం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

Roopa Reddy Case

Roopa Reddy Case : అధిక వడ్డీలు, భారీ లాభాలు ఇస్తామని ఆశచూపి నగదు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై రూపా రెడ్డిపై రాయదుర్గం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మొత్తం రూ.26 లక్షలకు పైగా నగదు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు.

Also Read : Varuna Yagam : మహా వరుణయాగంలో ‘కరీరీ ఇష్టి’ అంటే ఏమిటో తెలుసా? యాగంలో ఉపయోగించే మూలికలు ఇవే..

ఇప్పటికే రూపారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మానెమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఆమెపై ఇద్దరు ఫిర్యాదు చేయడంతో మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు విజయలక్ష్మీ అనే మహిళను కులం పేరుతో దూషించడంతో ఆమె ఫిర్యాదు మేరకు రూపారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.

మణికొండకు చెందిన డి. సీతాదేవి (65) నుంచి రూపా రెడ్డి రూ.12 లక్షలు, ఆమె కుమార్తె పద్మ నుంచి మరో రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. అధిక వడ్డీ, లాభాలు ఇస్తామని నమ్మించి ఈ మొత్తాలను తీసుకున్నట్లు ఆరోపించారు. అయితే, అందులో రూ.5 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించి, మిగిలిన డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు తెలిపారు. మిగిలిన నగదును తిరిగి ఇవ్వాలని ప్రశ్నించగా రూపా రెడ్డి భర్త బెదిరింపులకు పాల్పడ్డారని సీతాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో మణికొండకు చెందిన ఉపాధ్యాయురాలు జి. రమాదేవి (45) వద్ద నుంచి రూపా రెడ్డి రూ.16 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా రాయదుర్గం పోలీసులు రూపారెడ్డిపై రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగదు లావాదేవీలు, వడ్డీ వ్యాపారం పేరుతో జరిగిన వ్యవహారంపై వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే.. రూపారెడ్డిపై రాయదుర్గంతోపాటు ఫిల్మ్ నగర్, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలోనూ చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం.