Rythu Bharosa : వారికి మాత్రమే ‘రైతు భరోసా’ నిధులు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
Rythu Bharosa Scheme : ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు.
- Harishth Thanniru
- Updated on- March 16, 2026 / 07:42 AM IST
Rythu Bharosa Scheme
- ‘రైతు భరోసా’ నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
- మూడు విడతల్లో రూ.9వేల కోట్లు జమ చేయనున్న సర్కార్
- తొలి విడతలో ఎకరం రైతులకు 22న నగదు విడుదల
- ఈసారి వారికి మాత్రమే నిధులు జమయ్యే అవకాశం
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ‘రైతు భరోసా’ నిధులకోసం ఎదురు చూస్తున్న సన్న, చిన్నకారు రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది.
Also Read : Rain Alert : రెయిన్ అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఐదు రోజులు వానలేవానలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. తొలి విడతలో ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ అకౌంట్లలో రైతు భరోసా నగదు జమ చేస్తారు.
తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. 20రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది సర్కార్. ఈ దశలో సుమారు రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ఇక ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులను జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు జమ కానున్నాయి.
అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా ఎకరాకు రూ.12 వేలను రెండు విడతల్లో రూ.6వేల చొప్పు ఇస్తుంది. ప్రస్తుతం యాసంగికి సంబంధించి.. తొలి విడతలో ఎకరం భూమి కలిగిన రైతులందరికీ ‘రైతు భరోసా’ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. మిగిలిన రెండు విడతల్లో ఎన్నిఎకరాల వరకు, ఎంత మంది రైతులకు నిధులు పంపిణీ జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు.
అయితే, చివరి దశలో 3 నుంచి ఐదు ఎకరాలు కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేవలం వానాకాలం సీజన్ లో నమోదైన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తారా.. ప్రస్తుతం కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, వానాకాలం సీజన్లో రైతుల సంఖ్య కంటే.. ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద లబ్ధిపొందే అన్నదాతల సంఖ్య పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
