Inter Exams: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేయలేదు – సబితా

Inter Exams

Inter Exams: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను రద్దు చేశారంటూ వచ్చిన వార్తలపై తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడాతూ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. పరీక్షలపై రివ్యూ చేయాల్సిన వసరం ఉందని అధికారులతో సమావేశమై చర్చించిన తర్వాతనే పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి వివరించారు. కాగా కరోనా తీవ్రత కారణంగా ఇప్పటికే 10, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం విదితమే.. గత కొంత కాలంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అనే దానిపై చర్చ నడుస్తుంది. త్వరలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది