×
Ad

Saddula Bathukamma: ట్యాంక్ బండ్ పై అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..

9 రోజుల పాటు తీరొక్క పూలతో ఎంతో ఆనందంగా బతుకమ్మ ఆడిన మహిళలు.. ఇవాళ చివరి రోజు సద్దుల బతుకమ్మను సాగనంపుతున్నారు.

Saddula Bathukamma: హైదరాబాద్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభంగా సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు తీరొక్క పూలతో ఎంతో ఆనందంగా బతుకమ్మ ఆడిన మహిళలు.. ఇవాళ చివరి రోజు సద్దుల బతుకమ్మను సాగనంపుతున్నారు. మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. భక్తితో గౌరమ్మను కొలిచారు.

ట్యాంక్ పై జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. 500 మంది కళాకారులతో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బతుకమ్మ పాటలతో ట్యాంక్ బండ్ ప్రాంతం అంతా మారుమోగిపోతోంది. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమర జ్యోతి స్థూపం దగ్గరి నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు.