రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ఎన్నికల ముందే ప్రకటిస్తే ఇలా జరిగి ఉండేది: కాంగ్రెస్ నేత సంపత్

Sampath Kumar: రేవంత్‌ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవికాదంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు..

Sampath Kumar

తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్‌ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవికాదంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డే సీఏం అని ముందుగా ప్రకటిస్తే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు కూడా ఓడిపోయేవారని చెప్పారు.

ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పదేళ్ల పాటు కేటీఆర్ యువరాజులా కొనసాగారని, విచ్చలవిడిగా ఆర్థిక దోపిడీ చేశారని సంపత్ కుమార్ ఆరోపించారు. అంతరిక్షంలోకి వెళ్లిన ప్రజలు పిలిస్తే కూడా వస్తానని కేటీఆర్ అంటున్నారని చెప్పారు. అసలు అయన్ని ఎవరు పిలిచారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల వేళ టికెట్ల విషయంలో ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిపై సంపత్ కుమార్ మాట్లాడారు. పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. ఆశావహుల జాబితాలో ఉన్నా అని మాత్రమే మల్లు రవి చెప్పారని తెలిపారు. తమ ఇద్దరితో పాటు మరో 26 మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్పారు. నాగర్ కర్నూల్‌లో న్యాయ్ యాత్ర చేయబోతున్నానని తెలిపారు. బీఆర్ఎస్‌లో అనేక మంది అవమానాలు ఎదుర్కున్నారని చెప్పారు.

 Read Also: భీమవరం జనసేన అభ్యర్థి ఖరారు? పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..!

ట్రెండింగ్ వార్తలు