Revanth Reddy : సిగ్గుండాలి.. పార్టీని దెబ్బతీసేందుకే రాజీనామా- పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి ఫైర్

రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడని ఎవరైనా అన్నం తినే వాళ్ళు అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కడే టికెట్లు ఇవ్వడు. Revanth Reddy

Revanth Reddy Slams Ponnala Lakshmaiah (Photo : Google)

Revanth Reddy Slams Ponnala Lakshmaiah : కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కి రాజీనామా చేయడంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్లు పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ మారడానికి సిగ్గుండాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా, మంత్రిగా పని చేశారు. ఇదేం తీరు? అని పొన్నాలపై ధ్వజమెత్తారు. ప్రజల్లో ఉంటే ప్రజాసేవ చేస్తే ఎందుకు గెలవరు? అని పొన్నాలను ప్రశ్నించారు.

”పీసీసీగా ఉండి 40వేల ఓట్లతో ఓడిపోయారు. రెండోసారి ఇస్తే 50వేల ఓట్లతో ఓడిపోయారు. అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఏ కారణంతో ఆ చిల్లర కామెంట్ చేశారు. జనగాం టికెట్ పై ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశాం. అందులో పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. పార్టీని దెబ్బతీయడానికి, వీక్ చేయడానికి పొన్నాల ఈ నిర్ణయానికి వచ్చారు.

Also Read : పదవుల కోసం కాదు అవమానాలు భరించలేకే రాజీనామా చేశా : పొన్నాల లక్ష్మయ్య

పొన్నాల లక్ష్మయ్య కార్యకర్తలకు క్షమాపణ చెప్పి బేషరతుగా రాజీనామాను ఉపసంహరించుకోవాలి. అన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చాం. రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడని ఎవరైనా అన్నం తినే వాళ్ళు అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కడే టికెట్లు ఇవ్వడు. ఒక ప్రాసెస్ ప్రకారం టికెట్లు ఇస్తాం. సీఈసీ అనేది కాంగ్రెస్ లో ముఖ్యమైనది. వాళ్లే టికెట్లు, అభ్యర్థులను ఖరారు చేస్తారు.

విడతలవారిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్ర ఉంటుంది. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణపైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. 75 సీట్లకుపైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది మధ్యలో ఆరు గ్యారెంటీలపై సంతకం పెడతాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : కేసీఆర్, హరీశ్‌, కేటీఆర్ లక్ష్యంగా.. బీజేపీ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

కాగా, అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో కలకలం రేగింది. సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గేను పంపారు. రాజీనామా ప్రకటిస్తు లేఖ చూపిస్తు పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానని.. ఇక భరించలేక రాజీనామా చేశానని తెలిపారు. 45ఏళ్ల రాజకీయ జీవితం నాది.. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నా.. పదవుల కోసం కాదు. ర్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేయాల్సి వచ్చింది అని పొన్నాల వాపోయారు.

ట్రెండింగ్ వార్తలు