SBI Scholarships : విద్యార్థులకు అద్భుత అవకాశం.. ఒక్కొక్కరికి రూ.15లక్షల వరకు సాయం.. అర్హత పొందేందుకు లాస్ట్ తేదీ ఇదే!
SBI Scholarship 2026 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్పొరేట్ సామాజిక బాధ్యతా (సీఎస్ఆర్) విభాగమైన ఎస్బీఐ ఫౌండేషన్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాలకు చెందిన 25,707 మందికి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ‘ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026’ను ప్రారంభించింది.
- Harish Thanniru
- Updated on- July 24, 2026 / 01:54 PM IST
SBI Scholarship 2026
SBI Scholarships : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. చదువులో మంచి మార్కులు వచ్చి, ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు సిద్ధమైంది. ఒక్కో విద్యార్థికి రూ.15వేలు నుంచి రూ.15లక్షల వరకు వార్షిక ఉపకార వేతనం అందించనుంది. ఇందుకోసం రూ.100కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే, ఈ ఉపకార వేతనాలు 2500 మందికిపైగా విద్యార్థులకు అందించేందుకు ఎస్బీఐ సిద్దమవుతోంది. అర్హత పొందిన విద్యార్థుల ఖాతాల్లో నేరుగా సొమ్మును జమచేస్తోంది. మరి ఈ స్కాలర్ షిప్‌కు ఎవరు అర్హులు? దరఖాస్తు చేసుకోవాలంటే ఏం చేయాలి.. చివరి తేదీ ఏది..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Also Read : Traffic Challan Rules : వాహనదారులకు హెచ్చరిక.. మీ బండి మీద చలాన్లు పెండింగ్ ఉన్నాయా?..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కార్పొరేట్ సామాజిక బాధ్యతా (సీఎస్ఆర్) విభాగమైన ఎస్బీఐ ఫౌండేషన్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాలకు చెందిన 25,707 మందికి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ‘ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2026’ను ప్రారంభించింది. పేద విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కాలర్‌షిప్స్ కోసం రూ.100కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఎంపికైన విద్యార్థులకు రూ.15,000 నుంచి రూ.15లక్షల వరకు వార్షిక ఉపకార వేతనం అందించనుంది.
ఈ ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. గత విద్యా సంవత్సరంలో కనీసం 75శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదంటే 7.5శాతం సీజీపీఏ సాధించాలి. ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్లలో నమోదు చేసుకునే వారికి అర్హత, వార్షిక కుటుంబం ఆదాయం. స్కూల్ విద్యార్థులకు అయితే రూ.3లక్షలు, కాలేజీ విద్యార్థులకు రూ.6లక్షలలోపు వార్షిక కుటుంబ ఆదాయం ఉండాలి. కేటగిరీని బట్టి రూ.15వేల నుంచి రూ.15లక్షల వరకు స్కాలర్ షిప్ లభిస్తుంది.
కనీస అర్హత సాధించిన విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అనేది కోర్సు పూర్తయ్యే వరకు లభిస్తుంది. ఈ ఏడాది దరఖాస్తు చేసుకునేందుకు 4 సెప్టెంబర్ 2026 గడువు తేదీగా నిర్ణయించారు. క్లాస్ 9-12 స్కూల్ స్టూడెండ్స్, అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, మెడికల్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్, ఐఐటీ విద్యార్థులు, ఐఐఎం విద్యార్థులు, మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. www.sbiashascholarship.co.in వెబ్‌సైట్ ద్వారా తమ అర్హత నిర్దారించుకుని అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్య అభ్యసించడానికి, వారి ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి సమాన అవకాశం లభించాలని విశ్వసిస్తున్నామని అన్నారు. మన దేశ వృద్ధిని, ప్రపంచ పోటీతత్వాన్ని నడిపించేలా తదుపరి తరం నాయకులు, ఆవిష్కర్తలు, నిపుణులను తీర్చిదిద్దాల అనుకుంటున్నామని అన్నారు.
