MLC Election: తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక.. షెడ్యూల్ విడుదల.. పోలింగ్, ఫలితాల తేదీలు ఇవే..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

MLC elections

MLC Election: తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయి నెలరోజులు కాకముందే.. తాజాగా ఎన్నికల సంఘం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.

 

ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఎంఎస్ ప్రభాకర్ ఉన్నారు. ఆయన పదవీకాలం మే 1వ తేదీతో ముగియనుంది. దీంతో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

 

షెడ్యూల్ ఇలా..
మార్చి 28న : నోటిఫికేషన్
ఏప్రిల్ 4న : నామినేషన్ చివరి తేదీ
ఏప్రిల్ 7న : నామినేషన్ స్క్రూటిని
ఏప్రిల్ 9న : నామినేషన్ ఉపసంహరణ గడువు
ఏప్రిల్ 23న : పోలింగ్
ఏప్రిల్ 25న : ఫలితాల వెల్లడి