Roopa Reddy Murder Case: పదో తరగతి విద్యార్థులే చంపేశారు.. ప్రిన్సిపాల్ హత్య కేసు ఛేదింపు.. విచారణలో సంచలన విషయాలు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి(Roopa Reddy Murder Case) దారుణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.

School Principal roopa reddy murder case solved tenth class students arrested

  • ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య
  • కేసును ఛేదించిన నల్లగొండ పోలీసులు
  • పదో తరగతి విద్యార్థుల అరెస్ట్

Roopa Reddy Murder Case: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది. ఈ సంచలన కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. గతనెలలో స్కూల్ హాస్టల్‌లో డబ్బులతో దొరికిన సదరు విద్యార్థులను ప్రిన్సిపాల్ మందలించడంతో, వారు ఆమెపై పగ పెంచుకున్నారు. జల్సాలకు అలవాటు పడి, యూట్యూబ్, సోషల్ మీడియాలో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు వెతికిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులే ఈ హత్యకు ప్లాన్ చేశారని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించారు.

IMD Alert: ఏపీ, తెలంగాణలో మారుతున్న వాతావరణం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

‘బాబూ’ అన్న ఒక్క మాటే కీలక ఆధారం:

హత్యకు ముందు రూపారెడ్డి(Roopa Reddy Murder Case) తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతుండగా ‘బాబూ..’ అని సంబోధించిన ఆఖరి మాటే దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. వారం రోజులు రెక్కీ నిర్వహించి, కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసిన నిందితులు రూపారెడ్డి ఇంటికి వెళ్లి దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడ ఉన్న రూ. 2.50 లక్షల నగదును దోచుకెళ్లారు. పోలీసులు 70 సీసీ కెమెరాల విజువల్స్, సాంకేతిక ఆధారాల సహాయంతో 80 మందికి పైగా అనుమానితులను విచారించి నిందితులను పట్టుకున్నారు.

దోనియాల వద్ద దొరికిన నిందితులు:

బుధవారం ఉదయం దోనియాల ఎక్స్ రోడ్డు వద్ద బైక్‌పై వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారి వద్ద లభించిన నగదులోని మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు లభించాయి. దీంతో పోలీసుల శైలి విచారణలో విద్యార్థులు నేరాన్ని అంగీకరించారు. కేసును సమర్థవంతంగా పూర్తి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.