Schools Reopen : తెలంగాణలో స్కూల్స్ పునఃప్రారంభం.. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభం

జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి.

Schools Reopen

Telangana Schools : తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం (జూన్12,2023) రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్స్ ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45 వరకు నిర్వహించనున్నారు.

జంట నగరాల్లో ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. జంట నగరాలు మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 గంటల నుండి 4.15 నిమిషాల వరకు నడవనున్నాయి. ప్రతి నెల నాలుగో శనివారం నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించనున్నారు.

Andhra Pradesh : విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ సమయాల్లో మార్పు, కొత్త టైమింగ్స్ ఇవే

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్  బుక్స్ చేరుకున్నాయి. త్వరలో విద్యార్థులకు యూనిఫాం అందజేస్తామని విద్యా శాఖ అధికారులు అంటున్నారు. అలాగే, ఈ ఏడాది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నోట్ బుక్స్ కూడా అందించనుంది.