×
Ad

Trains : మల్కాజ్‌గిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

  • Published On : July 10, 2022 / 08:13 AM IST

Trains

Trains :  ప్రయాణికుల డిమాండ్‌ మేరకు మల్కాజిగిరి-జాల్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 9, 16, 23, 30 తేదీల్లో మల్కాజిగిరి నుంచి 23.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07428)మరుసటి రోజు 10.20 గంటలకు జాల్నా చేరుకుంటుందని, జూలై 15, 22, 29 తేదీల్లో జాల్నా నుంచి 22.00 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07254) మరుసటి రోజు 8.50 గంటలకు మల్కాజిగిరి చేరుకుంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.