Telangana Assembly Election 2023 Result : సీఎం రేసులో ఉన్నా .. 78 సీట్లు పైనే గెలుస్తాం : భట్టి విక్రమార్క

తాను సీఎం రేసులో ఉన్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 78 పైన స్థానాలు గెలుస్తాంమని ధీమా వ్యక్తంచేశారు భట్టి విక్రమార్క. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో10కి10 స్థానాలు గెలుస్తామన్నారు.

Bhatti Vikramarka

Telangana Assembly Election 2023 Result : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యాక నేతలంతా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక కౌంటింగ్ కు సమయం ఆసన్నమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు హడావుడి మొదలైంది. కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. మరికొన్ని నిమిషాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాప్ట్ వేర్ ను ఉపయోగిస్తున్నారు.

మొత్తం 119 నియోజకవర్గాలకు 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణలో మొదటగా భద్రాచలం నియోజకవర్గం ఫలితం వెలువడనుంది. 13 రౌండ్లలో ఇక్కడ కౌంటింగ్ పూర్తవుతుంది. భద్రాచలం ఓట్ల లెక్కింపు తరువాత అశ్వరావుపేట నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది. 14 రౌండ్లలో ఇక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చివరగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఫలితం వెల్లడవుతుంది. ఇక్కడ 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

దీంతో ..భద్రాచలం కొత్తగూడెం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది వనమా వెంకటేశ్వరరావు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అలాగే వైరా బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ది బాణోత్ మదన్ లాల్ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కొత్తగూడెం ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్ది జలగం వెంకటరావు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్ లో భాగంగా సిఎల్పీ నేత,మధిర కాంగ్రెస్ నేత మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతు..తాను సీఎం రేసులో ఉన్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 78 పైన స్థానాలు గెలుస్తాంమని ధీమా వ్యక్తంచేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో10కి10 స్థానాలు గెలుస్తామని తెలిపారు.

తెలంగాణ ప్రజలు మాపై ఏ నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకంను నేరవేరుస్తామన్నారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేశా..గెలిచిన వారిని క్యాంప్ కు తీసికెళ్తే తప్పేంటి…? అని కాంగ్రెస్ క్యాంప్ రాజకీయాలపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.సీఎం కేసీఆర్ ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తాను సీఎం రేసులో ఉన్నానని..మరోసారి స్పష్టంచేశారు.

ట్రెండింగ్ వార్తలు