Congress Leader VH : కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు కారును ఢీకొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు కారుపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. తెల్లవారు జామున 4గంటల సమయంలో మరో వాహనంతో

Congress Leader VH : కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు కారును ఢీకొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

Congress Leader V Hanumantha Rao

Updated On : November 27, 2024 / 9:10 AM IST

Congress Leader VH: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు కారుపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. తెల్లవారు జామున 4గంటల సమయంలో మరో వాహనంతో తన ఇంటి వద్ద పార్కింగ్ చేసిన వీహెచ్ కారును దుండుగులు ఢీకొట్టారు. ఈ ఘటనలో వీహెచ్ కారు ముందు భాగం ధ్వంసం అయింది. గతంలోనూ తన కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు.. కారును ద్వంసం చేసిన వారికోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. హన్మంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Also Read: Ram Gopal Varma: నేనేమీ భయపడటం లేదు.. వీడియో విడుదల చేసిన ఆర్జీవీ.. సంచలన వ్యాఖ్యలు