Kcr Ramamana
L.Ramana Joins TRS party : తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రమణతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమణ ఇటీవలే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా పార్టీ ప్రాధమిక సభ్యత్వం తీసుకున్నారు.
కరీంనగర్, జగిత్యాల జిల్లాల నేతలతో పాటు రంగారెడ్డి ఇతర జిల్లాల నేతలు కూడా ఎల్.రమణతో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రమణ నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. నమ్మిన సిధ్దాంతం కోసం నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఎల్.రమణ అని కేసీఆర్ అన్నారు.
చేనేత సామాజికవర్గంలో కూడా నాయకత్వం పెరగాల్సిన అవసరం ఉందనికేసీఆర్ అన్నారు. చేనేత కార్మికులకు కుడా బీమా సౌకర్యం కల్పిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. రమణ సేవలను పార్టీకోసం విస్తృతంగా ఉపయోగించుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉద్యమ సమయంలో ఏ నేత ఎలా పని చేసారో అందరికీ తెలుసని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతం అభివృధ్ది చెందితేనేతప్ప తెలంగాణ అభివృధ్ది చెందదనే ఉద్దేశ్యంతోనే పునర్నిర్మాణ ప్రక్రియ అక్కడినుంచే ప్రారంభించామని అన్నారు. ఆరుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే తానే జోలి పట్టి వారి కుటుంబాలను ఆదుకున్నానని కేసీఆర్ అన్నారు.
వరంగల్ లో వెయ్యి ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభించామని అందులో త్వరలో 3వేల కోట్లతో భారీ పరిశ్రమ ప్రారంభించబోతున్న ట్లు కేసీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో చాలామంది చేనేత కార్మికులకు అక్కడ పని దొరుకుచతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో చేనేత లోకం తలెత్తుకుని బతికే పరిస్ధితి తెస్తాం అని కేసీఆర్ చెప్పారు.