Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. అసలు విషయం తెలిసి ఊపిరిపీల్చుకున్న అధికారులు

బాంబు బెదిరింపుకు పాల్పడిన ఆగంతుకుడి ఆచూకీ కనిపట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. మతిస్థిమితంలేని వ్యక్తి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు (ఆర్‌జీఐఏ) కస్టమర్ కాల్ సెంటర్‌కు

Rajiv Gandhi International Airport (File Photo)

Rajeev Gandhi Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబుస్కాడ్ టీమ్స్‌తో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన జీఎంఆర్ సెక్యూరిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది ఎయిర్ పోర్ట్‌లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభ్యం కాకపోవటంతో తనిఖీల అనంతరం ఎయిర్ పోర్ట్‌లో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు మెయిల్ నకిలీదని అధికారులు గుర్తించారు.

Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భద్రత కట్టుదిట్టం.. ఆగస్టు28 వరకు ఆంక్షలు

బాంబు బెదిరింపుకు పాల్పడిన ఆగంతుకుడి ఆచూకీ కనిపట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. మతిస్థిమితంలేని వ్యక్తి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు (ఆర్‌జీఐఏ) కస్టమర్ కాల్ సెంటర్‌కు మెయిల్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, అదే మెయిల్ నుంచి తిరిగి క్షమాపణలు కోరుతూ యువకుడి తల్లిదండ్రులు లెటర్ పంపినట్లు తెలిసింది. బాంబు బెదిరింపు అంతా ఫేక్‌గా తేలడంతో భద్రత సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెయిల్ చేసిన వ్యక్తి గురించి గాలిస్తున్నట్లు తెలిపారు.

 

ఎయిర్ పోర్ట్‌కు బెదిరింపు కాల్ సోమవారం వచ్చినట్లు తెలిసింది. సోమవారం ఉదయం 11.50 గంటల సమయంలో ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ కు మెయిల్ పంపాడు. ఆ మెయిల్‌లో రాత్రి 7గంటలకు బాంబు పేలుతుందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ తో ఎయిర్ పోర్ట్ మొత్తం క్షుణ్ణంగా తనికీలు నిర్వహించారు. చివరి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు