MLA Shanampudi Saidireddy
Shanampudi Saidireddy : ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓడిపోతాననే భయం పట్టుకుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఉత్తమ్ చేసేవి దగుల్బాజీ రాజకీయాలని విమర్శించారు. ఉత్తమ్ అర్ధరాత్రి చేసిన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఉత్తమ్ లా ప్యాకేజీ రాజకీయాలు చేయడం తనకు చేతకాదన్నారు.
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తమ పార్టీ మహిళలపై కాంగ్రెస్ కార్యకర్తలు నీచంగా దుర్భాషలాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఎవరైతే మీ ఏజన్సీ అని చెప్పుకుంటున్నావో అదే ఏజెన్సీ మాకు మూడు నెలలు నుంచి పనిచేస్తుందని పేర్కొన్నారు.
PM Modi : మరోసారి తెలంగాణకు ప్రధాని .. మూడు రోజులు, ఆరు సభల్లో మోదీ ప్రసంగాలు
ఆ ఏజెన్సీకి చెందిన వారు ప్రతీరోజూ తమ ఆఫీస్ కు వచ్చి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. వారు తమ దగ్గర పనిచేసి ఉత్తమ్ తో చేతులు కలిపి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని.. ఆ విషయం తనకు నిన్నటి వరకు తెలియదన్నారు.
ఆ ఏజెన్సీకి చెందిన వారు తమకు, ఉత్తమ్ కు పనిచేయడం వల్ల తమకు, వారికి గొడవలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. సదరు ఏజెన్సీ సంస్థ ఇరువురికి పనిచేయడం అనైతికం అన్నారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, మంత్రి కేటీఆర్ రేపు (గురువారం) హుజూర్ నగర్ రోడ్డు షో లో పాల్గొంటారని పేర్కొన్నారు.