PM Modi : మరోసారి తెలంగాణకు ప్రధాని.. మూడు రోజులు, ఆరు సభల్లో మోదీ ప్రసంగాలు
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ మూడు రోజుల్లో ఆరు సభల్లో పాల్గొననున్నారు.

pm narendra modi
pm narendra modi visit in telangana : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణలో గెలుపుపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఆ దిశగా కృషి చేస్తోంది. ఢిల్లీ నుంచి అగ్రనేతలు సైతం వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. దీంట్లో భాగంగా మరోసారి తెలంగాణకు రానున్నారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. మూడు రోజుల్లో ఆరు సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. దీని కోసం తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి, 26న తుఫ్రాన్, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ సభల్లో ప్రధాని పాల్గొననున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న క్రమంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారరంగంలో హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, రేవంత్ రెడ్డి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బహిరంగ సభలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Also Read: బీజేపీ బండారాన్ని నిర్మలా సీతారామన్ బయటపెట్టారు : హరీశ్ రావు
గులాబీ బాస్ కేసీఆర్ కూడా రోజుకు మూడు సభల్లో పాల్గొంటున్నారు. మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. దీని కోసం బీఆర్ఎస్ నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్ రావులతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా వరుస ప్రచారాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రావటం విశేషంగా మారింది. ఈసారి ప్రధాని మూడు రోజులు తెలంగాణలో పర్యటించటం మరో విశేషమని చెప్పాలి. మూడు రోజులు.. ఆరు సభల్లో పాల్గొని తెలంగాణ బీజేపీలో జోష్ పెంచనున్నారు.