Minister Harish Rao : బీజేపీ బండారాన్ని నిర్మలా సీతారామన్ బయటపెట్టారు : హరీశ్ రావు

తెలంగాణ అప్పులపై నిర్మలమ్మ మాట్లాడుతున్నారు..అన్ని రాష్ట్రాల కంటే తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణాయేనని తెలుసుకోవాలన్నారు.

Minister Harish Rao : బీజేపీ బండారాన్ని నిర్మలా సీతారామన్ బయటపెట్టారు : హరీశ్ రావు

Minister Harish Rao

Minister Harish Rao ..Minister Nirmala Sitharaman :  తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ అటాక్ చేశారు. తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పే ముందు తలసరి అప్పు గురించి కూడా చెప్పాలని ఆమె అన్నారు. నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు.. తెలంగాణ అప్పులపై నిర్మలమ్మ మాట్లాడుతున్నారు..అన్ని రాష్ట్రాల కంటే తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం తెలంగాణాయేనని తెలుసుకోవాలని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని..కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందని మరి ఎవరి పాలన బాగుందో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పాలన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఆమె బీజేపీ బండారాన్ని బయటపెట్టారని అన్నారు.

12 రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెడుతున్నారని ఆమె అన్నారు..కానీ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సీఎం కేసీఆర్ నిరాకరించారు అందుకే కేంద్రం ఇచ్చే రూ.25వేల కోట్ల నిధులు ఆపేసింది అంటూ ఆరోపించారు. దాదాపు రూ.లక్ష కోట్లు తెలంగాణకు రాకుండా కేంద్రం ఆపివేసిందని విమర్శించారు. కేంద్రం ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా సీఎం కేసీఆర్ మాత్రం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మోటార్లకు మీటర్లు పెట్టటాన్ని వ్యతిరేకించారని అన్నారు.

Also Read: ఆదాయం సరే.. అప్పుల గురించి చెప్పండి.. కేటీఆర్‭కు నిర్మల స్ట్రాంగ్ కౌంటర్

కాంగ్రెస్, బీజేపీ రెండు రైతు వ్యతిరేకపార్టీలు అంటూ ఈ సందర్బంగా హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మోటార్లకు మీటలు తప్పవన్నారు. రైతులను నిలబెట్టిన సీఎం కేసీఆర్ ను రైతులు తమ ఓట్లు వేసి నిలబెట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో రైతు పక్షపతిగా ఒక్క కేసీఆర్ మాత్రేమేనన్నారు.

రాబోయే కాలంలో ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, రైతులు అన్ని రంగాలవారు అండగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ కు మరోసారి ఓటువేసి గెలిపించాలనన్నారు.