Nirmala to KTR: ఆదాయం సరే.. అప్పుల గురించి చెప్పండి.. కేటీఆర్‭కు నిర్మల స్ట్రాంగ్ కౌంటర్

సీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదంటూ నిర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకమని అన్నారు. ప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు

Nirmala to KTR: ఆదాయం సరే.. అప్పుల గురించి చెప్పండి.. కేటీఆర్‭కు నిర్మల స్ట్రాంగ్ కౌంటర్

Nirmala Sitharaman: తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ అటాక్ చేశారు. తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పే ముందు తలసరి అప్పు గురించి కూడా చెప్పాలని ఆమె అన్నారు. తాను ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నానని, అప్పుల గురించి మాట్లాడుతున్నానని ఆమె అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై నిర్మల ఆందోళ వ్యక్తం చేశారు.

‘‘కాళేశ్వం ప్రాజెక్టు నిర్మాణం చేయటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైంది. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిస్తాం. నీళ్ళు, నిధులు, నియామకాల.. తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణను అప్పులు రాష్ట్రంగా మార్చారు. హైదరాబాద్ లాంటి సిటీని నైపుణ్యం ఉన్న‌ యువతను ఉపయోగించుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్ర చేసిన అప్పులు రాబోయే తరాలకు భారంగా మారుతుంది. బంగారం లాంటి రాష్ట్రాన్ని నాశనం చేశారు’’ అని నిర్మల అన్నారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘దళిత ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు. డిప్యూటీ సీఎం రాజయ్యను ఆరు నెలలకే తొలగించారు. బీసీ నేతను ముఖ్యమంత్రి చేసి తీరుతాం. ఎస్సీ వర్గీకరణపై ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం’’ అని అన్నారు. ఇక కేసీఆర్ పాలనపై స్పందిస్తూ ‘‘అక్షరాస్యతలో నేషనల్ యావరేజ్ కంటే తెలంగాణ వెనుకబడింది. కేసీఆర్ ఎన్మికల‌ హామీ 3,116/- నిరుద్యోగ భృతి ఎక్కడ? కేసీఆర్ హాయాంలో 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రధానమంత్రిని బూతులు తిట్టే ప్రభుత్వం తెలంగాణకు అవసరమా?’’ అని అన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ, అప్రజాస్వామికం అన్న పొన్నవోలు

అయితే కేసీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదంటూ నిర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకమని అన్నారు. ప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ పాలనపై ఆమె స్పందిస్తూ.. పది లక్షలకు గాను.. 8లక్షల ఉద్యోగాలను కేంద్రం భర్తీ చేసిందని, డిసెంబర్ లోపు మిగిలిన ఉద్యాలను భర్తీ చేస్తామని నిర్మల అన్నారు.

ఇది కూడా చదవండి: ‘కాంగ్రెస్ రనౌట్’ అన్న ప్రధానికి అదే స్టైల్లో రిప్లై ఇచ్చిన సచిన్ పైలట్