IND vs NZ : శ‌త‌క్కొట్టిన కేఎల్ రాహుల్.. రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో (IND vs NZ )భార‌త ఇన్నింగ్స్ ముగిసింది.

IND vs NZ : శ‌త‌క్కొట్టిన కేఎల్ రాహుల్.. రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?

IND vs NZ 2nd ODI kl rahul century New Zealand target is 285 (pic credit @bcci)

Updated On : January 14, 2026 / 5:08 PM IST

IND vs NZ : రాజ్‌కోట్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త ఇన్నింగ్స్ ముగిసింది. వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ (112; 92 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగులు సాధించింది. దీంతో న్యూజిలాండ్ ముందు 285 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ పై వ‌న్డేల్లో ఒకే ఒక భార‌తీయుడు..

భార‌త బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (56; 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) హాప్ సెంచ‌రీ చేశాడు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ (24), విరాట్ కోహ్లీ (23), ర‌వీంద్ర జ‌డేజా (27)లకు మంచి ఆరంభాల‌ను లభించిన‌ప్ప‌టికి వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ (8) విఫ‌లం అయ్యాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో క్రిస్టియన్ క్లార్క్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. కైల్ జేమీసన్, మైఖేల్ బ్రేస్‌వెల్, జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెనాక్స్ లు త‌లా ఓ వికెట్ తీశారు.