Haier 4K Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? 4 కొత్త హైయర్ 4K అల్ట్రా స్మార్ట్ టీవీలు.. ధర జస్ట్ రూ. 25,990కే.. ఫుల్ డిటెయిల్స్

Haier 4K Smart TVs : హైయర్ H5E సిరీస్ నుంచి 4K స్మార్ట్ టీవీలు వచ్చేశాయి. భారత మార్కెట్లో ఈ టీవీలను ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Haier 4K Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొంటున్నారా? 4 కొత్త హైయర్ 4K అల్ట్రా స్మార్ట్ టీవీలు.. ధర జస్ట్ రూ. 25,990కే.. ఫుల్ డిటెయిల్స్

Haier H5E Series 4K Smart TVs (Image Credit To Original Source)

Updated On : January 14, 2026 / 5:43 PM IST
  • హైయర్ 4 కొత్త 4K అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌టీవీలు
  • 43 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు స్క్రీన్ సైజులు
  • కొత్త హైయర్ టీవీలు బెజెల్-లెస్ స్క్రీన్‌లు
  • అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం

Haier 4K Smart TVs : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అతి త్వరలో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది. హైయర్ కొత్త స్మార్ట్ టీవీలు, హైయర్ H5E సిరీస్ 4K అల్ట్రా HD మోడల్స్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

43 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు స్క్రీన్ సైజులలో లభించే ఈ టీవీలు 43-అంగుళాల మోడల్‌కు రూ. 25,990 నుంచి ప్రారంభమవుతాయి. పాపులర్ హోం అప్లియన్సెస్ బ్రాండ్ హైయర్ కొత్త స్మార్ట్ టీవీలను ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేసింది.

ఇందులో హైయర్ H5E సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ గూగుల్ టీవీని అందిస్తోంది. కొత్త హైయర్ టీవీలు బెజెల్-లెస్ స్క్రీన్‌లను అందిస్తున్నాయి. ఇందులో డౌన్-ఫైరింగ్ స్టీరియో స్పీకర్లు అమర్చి ఉన్నాయి.

బెజెల్-లెస్ స్క్రీన్లు క్రిస్టల్-క్లియర్ 4కే అల్ట్రా హెచ్‌డీ విజువల్స్ అద్భుతమైన డాల్బీ ఆడియో సౌండ్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ప్రత్యేకత ఏమిటంటే.. కంపెనీ 43-అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 25,990 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది.

హైయర్ H5E సిరీస్ 4K అల్ట్రా HD ధరలివే :

హైయర్ H5E సిరీస్ 4K అల్ట్రా HD 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో అందుబాటులో ఉన్నాయి.

  • 43 అంగుళాల మోడల్ ధర రూ.25,990.
  • 50 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.32,990
  • 55 అంగుళాల మోడల్ ధర రూ.38,990.
  • 65 అంగుళాల మోడల్‌ ధర రూ.57,990

హైయర్ H5E సిరీస్ 4K అల్ట్రా హెచ్‌డీ టీవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
హైయర్ H5E సిరీస్‌లోని అన్ని మోడళ్లు 4K రిజల్యూషన్‌తో బెజెల్-లెస్ డిస్‌ప్లేతో వస్తాయి. అద్భుతమైన విజువల్స్‌ అందిస్తుందని పేర్కొంది. కంపెనీ రియల్ 4K రిజల్యూషన్, HDR10 సపోర్టు అందిస్తుంది. అన్ని టీవీలు క్లియర్ ఫొటోలు, మెరుగైన కాంట్రాస్ట్ రియల్ కలర్ ఆప్షన్లతో అందిస్తాయి.

Read Also : Samsung Galaxy S25 5G : బిగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఎంత తగ్గిందో తెలుసా?

పిల్లల కోసం కిడ్స్ మోడ్ :
కొత్త హైయర్ టీవీల్లో కిడ్స్ మోడ్‌ ఫీచర్లు ఉన్నాయి. పిల్లలకు ఏ కంటెంట్‌ చూడాలో కంట్రోల్ చేయొచ్చు. హైయర్ టీవీలు 178-డిగ్రీల వెడల్పు వ్యూ యాంగిల్ ఉంటాయి. మీరు ఏ వైపు నుంచి చూసినా స్టేబుల్ ఫొటో క్వాలిటీ ఉంటుంది. MEMC టెక్నాలజీ కూడా ఉంది. రియల్ ఫ్రేమ్‌ల మధ్య క్లారిటీగా వ్యూ కనిపిస్తుంది. యాక్షన్ సీన్లు మరింత రియల్‌గా కనిపిస్తాయి.

Haier H5E Series 4K Smart TVs

Haier H5E Series 4K Smart TVs (Image Credit To Original Source)

2GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఆప్షన్లు :
హైయర్ H5E సిరీస్‌లో 7 మల్టీ-పిక్చర్ మోడ్‌లు ఉన్నాయి. ఈ ఫీచర్ మూవీలను మరింత సినిమాటిక్‌గా కనిపించేలా ఉంటుంది. సౌండ్ విషయానికొస్తే.. కొత్త హైయర్ టీవీలు డాల్బీ ఆడియో సపోర్టుతో 20W డౌన్-ఫైరింగ్ స్టీరియో స్పీకర్‌ ఉన్నాయి. సరౌండ్ సౌండ్ క్లియర్ వాయిస్ వినిపిస్తుంది. 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తాయి.

2.4GHz, 5GHz డ్యూయల్-బ్యాండ్ Wi-Fiకి సపోర్టు ఇస్తుంది. బ్లూటూత్ 5.1కి సపోర్టు ఇచ్చే హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు ఇతర అప్లియన్సెస్ ఈజీగా కనెక్షన్‌ పొందవచ్చు. ఇందులో 4 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లతో గేమింగ్ కన్సోల్‌లు, సౌండ్‌బార్లు, సెట్-టాప్ బాక్స్‌లు, స్టోరేజీ ఆప్షన్లతో కనెక్ట్ చేయవచ్చు.