Sankranti Rush : సంక్రాంతి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.. డైవర్షన్స్ చూసుకోండి..

Sankranti Rush : ఏపీ వైపు వెళ్లే వాహనాలు నగరం నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆదివారం తెల్లవారుజామున పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది. దీంతో టోల్ గేట్ సిబ్బంది ఎక్కువ టోల్ బూత్ లను ఓపెన్ చేశారు.

Sankranti Rush : సంక్రాంతి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్.. డైవర్షన్స్ చూసుకోండి..

Sankranti Rush

Updated On : January 11, 2026 / 11:30 AM IST
  • సంక్రాంతి పండుగ వేళ పల్లెబాట పట్టిన హైదరాబాద్ వాసులు
  • హైదరాబాద్ – విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ
  • పంతంగి టోల్‌ప్లాజా వద్ద నెమ్మదిగా కదులుతున్న వాహనాలు

Sankranti Rush : సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులు పల్లెబాట పట్టారు. మూడురోజులు జరిగే సంక్రాంతి సంబురాలను పల్లెల్లో ఘనంగా జరుపుకోనున్నారు. స్కూళ్లకు, కళాశాలలకు సెలవులు రావడంతోపాటు పలు కార్యాలయాలకు సెలవులు రావడంతో ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లి సంక్రాంతి పండుగ నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికంగా నివాసం ఉంటున్నారు. వారంతా పల్లెలకు బయలుదేరడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

Also Read : AP Rain Alert : రెయిన్ అలర్ట్.. తీరందాటిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..

ఏపీ వైపు వెళ్లే వాహనాలు నగరం నుంచి పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో ఆదివారం తెల్లవారుజామున పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ పెరిగింది. దీంతో టోల్ గేట్ సిబ్బంది ఎక్కువ టోల్ బూత్ లను ఓపెన్ చేశారు. కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. శనివారం సాయంత్రం 6గంటల నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు 70వేల వాహనాలు ఏపీవైపు వెళ్లాయని పంతంగి టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. ఇవాళ ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సంక్రాంతి పండుగ వేళ ఏపీకి వెళ్లే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు అధికశాతం మంది తమ సొంత వాహనాల్లో ఏపీలోని తమ స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలకు ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు వాహనాల రద్దీ నేపథ్యంలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్స్ అందుబాటులో ఉంచారు. ఇదిలాఉంటే.. హైదరాబాద్ నుంచి వెళ్తున్న వాహనాలతో ఏపీలోని నందిగామ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వైజంక్షన్ వద్ద రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంక్రాంతి పండుగకోసం నగర వాసులు పల్లెబాట పట్టడంతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసోపాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లతోపాటు దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్ బస్టాండ్ ప్రాంతాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వేసైతం స్పెషల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.