హైదరాబాద్ శివారులో అరకును పోలిన అనుభవం.. అబ్బురపరుస్తున్న వాతావరణం.. వెళ్లి చూస్తారా?

కొహెడ గుట్టపై నిలబడితే హైదరాబాద్ నగరాన్ని అంచుల వరకూ చూడవచ్చు. ప్రశాంత వాతావరణం అక్కడ కనపడుతుంది.

హైదరాబాద్ శివారులో అరకును పోలిన అనుభవం.. అబ్బురపరుస్తున్న వాతావరణం.. వెళ్లి చూస్తారా?

Koheda Gutta (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 4:50 PM IST
  • రెండు వారాలుగా కురుస్తున్న మంచు
  • వీడియోలు, రీల్స్‌ తీసుకుంటున్న స్థానికులు
  • గుట్టపై గుడి, ప్రశాంత వాతావరణం

Koheda Gutta: హైదరాబాద్‌ శివారులోని కోహెడ గుట్టలో రెండు వారాలుగా కురుస్తున్న మంచు వల్ల అక్కడి ప్రాంతం అరకును పోలి కనపడుతోంది. అక్కడికి వెళ్తున్న వారు వీడియోలు, రీల్స్‌ చేసుకుంటున్నారు. ఉదయం వేళ గుట్టపై కురుస్తున్న మంచు అంతా మబ్బుల్లా కనపడుతోంది.

వాతావరణం అబ్బురపరుస్తుండడంతో చాలా మంది వెళ్లి చూస్తున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పొలాలు, ఆంజనేయస్వామి మందిరం చూసి తీరాల్చిందేనంటూ పలువురు అంటున్నారు. తాము గగనంలో ఉన్నామంటూ అక్కడికి వెళ్లివారు రీల్స్‌లో చెబుతున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సర్వీస్ రోడ్ సమీపంలో కోహెడ గుట్ట ఉంటుంది. పెద్ద అంబర్‌పేట్ నుంచి అక్కడికి వెళ్లొచ్చు.

Also Read: ఇరాన్‌ ప్రజలకు “బాహుబలి” రేంజ్‌లో భరోసా ఇచ్చిన క్రౌన్ ప్రిన్స్.. అమెరికా నుంచి.. త్వరలోనే ఏం జరగనుందంటే?

కొహెడ గుట్టపై నిలబడితే హైదరాబాద్ నగరాన్ని అంచుల వరకూ చూడవచ్చు. ప్రశాంత వాతావరణం అక్కడ కనపడుతుంది. ఇటీవలి కాలంలో వారాంతాల్లో పర్యాటకులు, నగరవాసులు విశ్రాంతి కోసం ఎక్కువగా సందర్శించే ప్రదేశంగా ఇది మారింది.

ఓఆర్‌ఆర్‌ వ్యూ పాయింట్‌గా ఇది మారింది. ఫొటోగ్రాఫర్లు కూడా ఇక్కడి నుంచి చుట్టు పక్కల ప్రదేశాలను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ గుట్ట గురించి చాలా మందికి తెలుస్తోంది. కొందరు కుటుంబ సభ్యులతో వెళ్లి గడిపి వచ్చేలా ప్రశాంత వాతావరణం ఉండడం, గుట్టపైనే మందిరం ఉండడంతో అందరినీ ఆకర్షిస్తోంది.