ఇరాన్‌ ప్రజలకు “బాహుబలి” రేంజ్‌లో భరోసా ఇచ్చిన క్రౌన్ ప్రిన్స్.. అమెరికా నుంచి.. త్వరలోనే ఏం జరగనుందంటే?

ట్రంప్‌ను స్వేచ్ఛా ప్రపంచ నాయకుడిగా క్రౌన్‌ ప్రిన్స్ అభివర్ణించారు. సాయం చేయడానికి ట్రంప్‌ సిద్ధమని, ఇరాన్‌ బలగాలు బలహీనమైపోయాయని చెప్పారు.

ఇరాన్‌ ప్రజలకు “బాహుబలి” రేంజ్‌లో భరోసా ఇచ్చిన క్రౌన్ ప్రిన్స్.. అమెరికా నుంచి.. త్వరలోనే ఏం జరగనుందంటే?

Iran Protesters (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 5:07 PM IST
  • నిరసనలను ఆపేయొద్దు
  • ఇరాన్‌ బలగాలు బలహీనపడ్డాయి
  • ట్రంప్‌ సాయం చేయడానికి సిద్ధం

Iran Protesters: ఇరాన్‌ ప్రజలకు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి కీలక సూచన చేశారు. నిరసనలను కొనసాగిస్తూ టెహ్రాన్‌ వీధుల్లోనే ఉండాలని, తన మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పాడు. వరుసగా 3 రాత్రులు వీధుల్లోనే నిరసకారులు ఉండడంతో, ఇరాన్‌ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ హొసేని ఖమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ పాలనలోని “అణచివేత వ్యవస్థ” తీవ్రంగా బలహీనపడిందని తెలిపారు.

అమెరికాలో నివసిస్తున్న క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ఇచ్చిన పిలుపు మేరకు నిరసనకారులు మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన విషయం తెలిసిందే. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు రెజా పహ్లవి తండ్రి మొహమ్మద్ రెజా షా ఇరాన్‌ను విడిచి వెళ్లిపోయారు.

ఇరాన్‌ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొహమ్మద్ రెజా షా పాలనకు అనుకూలంగా నిరసనకారులు నినాదాలు చేశారు. భద్రతా బలగాల అణచివేత చర్యలు, పాలక మతాధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

Also Read: Jayakrishna : థ్యాంక్యూ బాబాయ్ అంటూ.. మహేష్ అన్న కొడుకు హీరో జయకృష్ణ ఫస్ట్ స్పీచ్ వైరల్..

“వీధుల్లో నిరసన తెలుపుతున్న లక్షల మందిని ఎదుర్కొనేందుకు ఇస్లామిక్ రిపబ్లిక్ వద్ద భద్రతా బలగాల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయానికి సంబంధించి విశ్వసనీయ నివేదికలు నాకు చేరాయి. ఇప్పటివరకు అనేక సాయుధ దళాలు తమ కార్యాలయాలను వదిలివెళ్లిపోయాయి. ప్రజలను అణచివేయాలన్న ఆదేశాలను ఆ దళాలు లెక్కచేయలేదు. ఇక కొద్దిమంది కిరాయి సాయుధులు మాత్రమే ఖమేనీ వద్ద మిగిలారు. వారు ఇరానీయులు కాదు.. ఇరాన్ వ్యతిరేకులు. వారి చర్యలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసుకోండి” అని పహ్లవి ఎక్స్‌లో పేర్కొన్నారు.

సాయం చేయడానికి ట్రంప్ సిద్ధం

సాయం చేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి తెలిపారు. “మీరు ఒంటరివారు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్‌ పౌరులు గర్వంగా మీ గళాన్ని ప్రతిధ్వనించేలా చేస్తున్నారు. వారిని టీవీల్లో తప్పక చూడండి. ఈ రోజు ప్రపంచం మీ జాతీయ విప్లవానికి మద్దతుగా నిలుస్తోంది. మీ ధైర్యాన్ని అభినందిస్తోంది.

ముఖ్యంగా స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీ సాహసాన్ని సునిశితంగా గమనిస్తున్నారు. మీకు సాయం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆందోళనలను విడిచిపెట్టవద్దు. నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. త్వరలో మీ పక్కనే ఉంటానని నాకు తెలుసు” అని అన్నారు.