Telangana New CS Shanti kumari _ (1)
Telangana New CS Shanti kumari : తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతికుమారిని ప్రస్తుతం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న శాంతికుమారిని సీఎస్‌గా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం శాంతి కుమారి తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. 2025 ఏప్రిల్ వరకు శాంతి కుమారి సీఎస్ గా కొనసాగనున్నారు. ఏపీ క్యాడర్ కు బదిలీ అయిన తెలంగాణ మాజీ సీఎం సోమేశ్ కుమార్ శాంతి కుమారికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం రిలీవ్ అయ్యారు. దీంతో తెలంగాణకు తొలి మహిళా సీఎస్ గా శాంతి కుమారి చరిత్ర సృష్టించారు. శాంతి కుమారికి సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సీఎస్ గా నియమించినందుకు శాంతికుమారి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీమతి ఎ. శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. pic.twitter.com/EX1HmWoXzQ
— Telangana CMO (@TelanganaCMO) January 11, 2023
కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా ఉన్న శాంతికుమారి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. కోవిడ్ సమయంలో వైద్యఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో బీసీ,వెల్ఫేర్ కమిషనర్‌గా పనిచేశారు. సీఎం కార్యాలయంలోనూ విధులు నిర్వహించారు. శాంతి కుమారి ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివారు. అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు.
Telangna New CS Shanthi kumari : తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతి కుమారి .. కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వనున్న ప్రభుత్వం
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. గతంలో నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా పని చేశారు. శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ సీఎస్ గా కొనసాగుతున్న సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు వెళ్లాల్సిందేనని హైకోర్టు ఆదేశించటంతో సోమేశ్ కుమార్ బాద్యతల నుంచి రిలీవ్ అయ్యారు. శాంతికుమారికి బాధ్యతలు అప్పగించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. pic.twitter.com/OUIm534Qhs
— Telangana CMO (@TelanganaCMO) January 11, 2023