YSRTP President YS Sharmila
YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో వైరల్ గా మారింది. షర్మిల కారులో బయటకు వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. పలుసార్లు వారించినా పోలీసులు ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా పోలీసులు వెనక్కు తగ్గకపోవటంతో తనకు ఎదురువచ్చిన పోలీసులను పక్కకు నెట్టేసింది. ఈ ఘటనతో లోటస్ పాండ్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై షర్మిల మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను ఏమైనా క్రిమినల్ నా? హంతకురాలినా? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Sharmila Arrested : పోలీసుల్ని నెట్టేసి .. మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన షర్మిల
సిట్ (SIT) కార్యాలయానికి నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అనుకున్నాను. సిట్ అధికారిని కలిసి టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) దర్యాప్తు మీద వినతిపత్రం ఇవ్వాలని అనుకున్నాం. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు మా అనుమానాలను అధికారికి చెప్పడం మా భాధ్యత. సిట్ ఆఫీస్‌కి వెళ్ళడానికి నేను ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ధర్నాకు పోలేదు, ముట్టడి అని పిలుపు ఇవ్వలేదు. నన్ను బయటకు పోనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటారు? అంటూ షర్మిల ప్రశ్నించారు. నేను ఏమైనా క్రిమినల్ నా.? హంతకురాలినా? నాకు వ్యక్తిగత స్వేచ్చ లేదా? నా ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకు? అని షర్మిల ప్రశ్నించారు.
పోలీసులు నాపై దురుసు ప్రవర్తనకి దిగారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడ్డారని, నన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారని అన్నారు. నామీద పడితే నేను భరించాలా? అంటూ ఆమె ప్రశ్నించారు. నా రక్షణకోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం నా భాధ్యత అని. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారు అంటూ ప్రశ్నించారు.