×
Ad

హస్తం పార్టీ ఎమ్మెల్యేల సొంతూర్లలో షాకింగ్ రిజల్ట్స్‌..! ఇందుకేనా?

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత తీపి, కొంత చేదులా ఫలితాలు వచ్చాయి.

Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇంట్రెస్టింగ్‌ చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ గుర్తులతో సంబంధం లేని ఎన్నికలే అయినా..పార్టీల జోక్యం మాత్రం తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు..ఎన్నికల బరిలో నిలిస్తే పలు చోట్ల షాకింగ్ రిజల్స్ట్‌ హాట్ టాపిక్ అయ్యాయి.

పంచాయతీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంది. వచ్చే జనరల్ ఎలక్షన్స్‌కు సర్పంచ్‌ ఎన్నికలు బేస్ అనే థాట్‌తో పూర్తి ఎఫర్ట్ పెట్టారు లీడర్లు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ముఖ్యనేతలతో జూమ్ మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టి.. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లారు. ముఖ్యనేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఫుల్ ఫోకస్ చేయడంతో..ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌ కలిపి..దాదాపు 65శాతం వరకు పంచాయతీలను కైవసం చేసుకోగలిగారు. (Panchayat Elections)

టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక.. ఏ క్షణమైనా ప్రకటన..!? లీకులు ఏం చెబుతున్నాయంటే?

సర్పంచ్‌ ఎన్నికల్లో వార్ వన్‌సైడే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసిన కాంగ్రెస్‌కు ఇప్పుడొచ్చిన ఫలితాలు పెద్ద జోష్‌ ఇవ్వకపోగా..కీలకమైన ఎమ్మెల్యేల సొంతూర్లలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్‌ ఎన్నికల్లో ఎమ్మెల్యేల గ్రామాల్లో పార్టీ ఓడిపోవడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అప్రమత్తమై..రెండు, మూడు విడుతల్లో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ సేమ్ ఫలితాలు రిపీట్ అయ్యాయి.

రెండో విడతలో కూడా ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమైన చోట్ల కాంగ్రెస్ ఓటమిపాలైంది. మొదటి విడతలో జరిగిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సొంతూరు సోమ్లా తండాలో తన మద్దతుదారుడ్ని గెలిపించుకోలేకపోయారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ అభ్యర్థి గెలిచి షాక్ ఇచ్చారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య స్వంత గ్రామం వీర్లపల్లిలో ఎమ్మెల్యే మద్దతుదారుడు ఓడిపోయారు. ఇక రెండో విడతలో కూడా సేమ్ టు సేమ్ ఎమ్మెల్యేల సొంతూర్లలో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారు.

వీళ్లందరికీ ఓటమి
రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సొంత గ్రామం షాబాద్ మండలం గొల్లూరుగూడలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓటమిపాలయ్యారు. స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మద్దతుదారులు ఓడిపోయారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంతూరు తొర్రూరు మండలం చర్లపాలెం పంచాయతీలో కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ గెలిచాడు.

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్వంత గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుడు షాక్ ఇచ్చారు ప్రజలు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరు దమగ్నాపూర్‌లో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలిచాడు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి స్వంత గ్రామం ధన్వాడలో కాంగ్రెస్ మద్దతుదారుడు ఓడిపోగా..బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం ఇంచార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామం మాసానిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. ఇక సూర్యాపేట జిల్లాలో మరో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఎస్.ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ మద్దతుదారుడిగా ఎన్నికల బరిలో దిగిన వ్యక్తి ఓడిపోవడం చర్చనీయాంశం అవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత తీపి, కొంత చేదులా ఫలితాలు వచ్చాయి. మెజారిటీ సర్పంచ్‌ స్థానాలు గెలుచుకున్నామన్న ఆనందం ఒకవైపు..అనుకున్నట్లుగా వార్‌ వన్‌సైడ్ కాలేదని..ఎమ్మెల్యేల సొంతూర్లలో కూడా పార్టీ మద్దతుదారులు గెల్వలేదన్న బాధ ఇంకోవైపు వెంటాడుతోందట. ఇక మూడో విడుతలోనైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా మిగతా నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారట. థర్డ్ ఫేజ్‌ ఎన్నికలున్న గ్రామాల్లో నేతలు తమ అభ్యర్థులను గెలిపించుకుంటారో లేదో చూడాలి మరి.