Sikki Reddy Mother: కేపీ చౌదరికి డ్రగ్స్ అలవాటు ఉందని మాకు తెలియదు.. నా బిడ్డకు అతనితో ఎలాంటి పరిచయం లేదు

కేపీ చౌదరికి డ్రగ్స్ అలవాటు ఉందని మాకు తెలియదని బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి తల్లి మాధురి అన్నారు.

KP Chaudhary

Drugs Case: కబాలి తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ అలియాస్ కేపి చౌదరి (KP Chaudhary) డ్రగ్స్ కేసు (KP Chaudhary) లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్‌ (KP Chaudhary) కు చెందిన పలువురికి కేపీ చౌదరి డగ్స్ విక్రయించినట్లు రెండు రోజులుగా పోలీసులు జరుపుతున్న విచారణలో వెల్లడైంది. పలు టాలీవుడ్ ప్రముఖులు ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు బిగ్‌బాస్ ఫెమ్ అషు‌రెడ్డి‌, జ్యోతి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణితోపాటు సుశాంత్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆషురెడ్డి, సుశాంత్ రెడ్డి, సురేఖ వాణిలు స్పందించారు. తాజాగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి తల్లి మాధురి ఈ కేసుపై స్పందించారు.

Drugs Case: కేపి చౌదరి డ్రగ్స్ కేసు.. స్పందించిన ఆషురెడ్డి, సురేఖ వాణి

కేపీ చౌదరికి డ్రగ్స్ అలవాటు ఉందని మాకు తెలియదని బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి తల్లి మాధురి అన్నారు. ఒక వారం రోజులపాటు ఇళ్ళు కావాలంటే స్నేహిత హిల్స్‌లో ఉన్న మా ఇంట్లో ఉండమని చెప్పాను.. అతనికి డ్రగ్స్ అలవాటు ఉందని తెలియదు. మాకు కేపీ చౌదరి 2011 నుంచి తెలుసు. ఇప్పటికే పోలీసులు వచ్చి స్నేహిత హిల్స్‌లోఉన్న ఇంటి సీసీ ఫుటేజ్ తీసుకున్నారు. సిక్కి రెడ్డి‌కి ఇంకా ఈ విషయం తెలియదు.

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలనం.. కేపీ చౌదరి లిస్టులో సెలబ్రిటీల పేర్లు, ఆ ఇద్దరితో వందల సంఖ్యలో ఫోన్ కాల్స్

సిక్కిరెడ్డి కుటుంబ సభ్యుల తోడులేకుండా బయటకు ఎక్కువగా వెళ్లదని, ఆమె గేమ్‌కోసం చాలా కష్టపడుతుందనేది అందరికీ తెలిసిన విషయమేనని మాధురి అన్నారు. నా బిడ్డకు కేపీ చౌదరికి ఎలాంటి పరిచయం లేదు. కావాలంటే సీసీ ఫుటేజ్ చూసుకోండి. మా అమ్మాయి పార్టీలకు వెళ్లదు. మందు అలవాటు లేదు. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం అని మాధురి అన్నారు.