సింగరేణిలో రక్షణ వారోత్సవాలు ప్రారంభం

  • Publish Date - December 16, 2019 / 04:31 AM IST

సింగరేణి సంస్థలో ఈ రోజు (డిసెంబర్ 16, 2019) నుంచి 52వ వార్షిక రక్షణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జీఎం పర్సనల్ ఆనందరావు తెలిపారు. మొత్తం 11 ఏరియాల్లోని అండర్‌గ్రౌండ్ మైన్స్, ఓపెన్‌ కాస్టులు, CHP, వర్క్‌షాపులు, సబ్‌ స్టేషన్లు, MVTC కార్యాలయాలు, హాస్పిటళ్లలో రక్షణ వారోత్సవాలను డిసెంబర్ 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఉన్న అన్ని ఏరియాల్లో పర్కటించి గనుల వద్ద కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్న గనులకు, ఓపెన్‌ కాస్టులకు అవార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.